వెంకీ బాబాయ్  ఫిక్సేనా...?

వెంకీ బాబాయ్  ఫిక్సేనా...?

యంగ్ హీరో రానా ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు.  కరోనా కారణంగా  షూటింగ్ లు ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఫిమిమ్ నగర్ లో ఓ వార్త తెగ చెక్కర్లుకొడుతుంది . నందమూరి బాలకృష్ణ తో రానా మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. మలయాళం లో వచ్చిన ''అయ్యప్పనుమ్ కోషియం'' అనే సినిమా గత ఫిబ్రవరి లో విడుదలై అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు  తెలుగులో రీమేక్ చేయాలనీ టాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రానా కలిసి నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో నటించడానికి బాలయ్య ఆసక్తి చూపించలేదట! అందుకే ఆయన స్థానం లో రానా బాబాయ్ అయిన విక్టరీ వెంకటేష్ ను తీసుకోవాలని చూస్తుందట చిత్రబృందం. ఈ విషయానికి సంభందించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ వెంకీమామ ఆడియో ఫంక్షన్ లో వెంకీ బాబాయ్ తీస్తామని వెంకటేష్ తెలిపాడు. సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నారు అని తెలుస్తుంది. అయితే చూడాలి మరి ఈ వెంకీ బాబాయ్ వచ్చేది నిజమేనా... కాదా అనేది.