అదే ఫార్ములాను రిపీట్ చేస్తున్న వెంకటేష్ !

అదే ఫార్ములాను రిపీట్ చేస్తున్న వెంకటేష్ !

 

ఎన్నాళ్లగానో సరైన హిట్ లేని వెంకీ ఈ ఏడాది 'ఎఫ్ 2' చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నాడు.  ఆ సినిమా అంతటి హిట్ అవడానికి కారణం వెంకీ కామెడీ టైమింగ్.  చాలా ఏళ్ల తర్వాత వెంకీలోని అసలు సిసలు కామెడీ టైమింగ్ చూసి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు.  అందుకే అదే ఫార్ములాను 'వెంకీ మామ'కు కూడా అప్లై చేస్తున్నాడు వెంకీ.  బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో వెంకటేష్, నాగ చైతన్య మధ్య మంచి కామెడీ సీన్స్ ఉంటాయని, వెంకీ కామెడీ టైమింగ్ మూలాన అవి చాలా బాగా పండాయని తెలుస్తోంది.