షూటింగ్ లో గాయపడ్డ వెంకటేష్..

షూటింగ్ లో గాయపడ్డ వెంకటేష్..

విక్టరీ వెంకటేష్ ఎఫ్ 2 తరువాత నాగచైతన్యతో కలిసి వెంకీమామ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వెంకటేష్.. పాయల్ రాజ్ పుత్ ల మధ్య ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నారు.  ఈ షూటింగ్ సమయంలో వెంకటేష్ కాలు బెణికింది.  వెంటనే వెంకటేష్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు.  

వెంకటేష్ కు కాలికి గాయం కావడంతో కొన్ని రోజులు షూటింగ్ ను పోస్ట్ ఫోన్ చేశారు.  బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.