వెంకటేష్ ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఏంటో ..?

వెంకటేష్ ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఏంటో ..?

విక్టరీ వెంకటేష్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటికీ సరిగ్గా 32 సంవత్సరాలైంది.  ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన వెంకటేష్ ఇటీవల కాలంలో సోలోగా కంటే మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు.  ప్రస్తుతం ఈ హీరో నాగచైతన్యతో వెంకీ మామ, వరుణ్ తేజ్ తో ఎఫ్2ఎఫ్ సినిమా చేస్తున్నారు.  ఈ రెండు ప్రజెంట్ షూటింగ్ దశలో ఉన్నాయి.  

ఇటీవలే ఈ నటుడు సోషల్ మీడియా దిగ్గజం ఇంస్టాగ్రామ్ జాయిన్ అయ్యారు.  కలియుగ పాండవుల దగ్గరి నుంచి ఇప్పటి వరకు నటుడిగా ఆదరిస్తూ వచ్చిన ప్రేక్షకులకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.  త్వరలోనే అందరికి ఓ సర్ప్రైజ్ ఇస్తానని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు వెంకటేష్.  ఈ సర్ప్రైజ్ ఏంటి అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా పక్కన పెట్టేశాడు.  వెంకటేష్ ఇవ్వబోతున్న ఆ సర్ప్రైజ్ ఏంటి అనే దానిపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.