రికార్డు చేసిన ఎఫ్2.. ఎక్కడంటే..

రికార్డు చేసిన ఎఫ్2.. ఎక్కడంటే..

వెంకటేష్, వరుణ్‌తేజ్‌ హీరోలుగా రెండేళ్ల క్రితం విడుదలైన సినిమా ఎఫ్2. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా, మెహ్రిన్‌ హీరోయిన్‌లుగా చేశారు. ఈ సినిమా అనిల్ రావిపుడి డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మాంచాడు. ఈ సినిమాలో చూపించిన ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. ఇందులో భార్యల కారణంగా వచ్చే ఫ్రస్ట్రేషన్‌ను ఎంతో ఫన్నీగా అనిల్ చూపించాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో నాజర్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రలు చేశారు. ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కించారు. ఈ సినిమాని 2019లో విడుదల చేశారు. అయితే ఈ సినిమాను దాదాపు రూ.30కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను చేసింది. దాదాపు రూ.120కోట్లను వసూళు చేసింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తు చేస్తున్నానుకుంటున్నారు. తాజాగా ఎఫ్2 మరో రికార్డు చేసింది. అది కూడా తెలుగులో కాదండీ హిందీలో సరికొత్త రికార్డును చేసింది. ఎఫ్2 హిందీ అనువాదం చేసిన సినిమా యూట్యూబ్‌లో కూడా భారీ హిట్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఈ సినిమా యూట్యూబ్‌లో దాదాపు వందమిలియన్ల్ వ్యూస్‌ను తెచ్చుకుంది. ఈ లెక్కలను ఇంకా లెక్కిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే వెంకటేష్, వరుణ్ తేజ్ సినిమా హిందీలో కొన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌ను కూడా చిత్రీకరిస్తున్నారు. దానికి ఎఫ్3 పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్రస్ట్రేషన్ భార్యల వల్ల కాకుండా డబ్బు కారణంగా వచ్చే యాంగిల్‌లో ఎఫ్3 ఉండనుందట. ప్రస్తుతం ఎఫ్3 తెలుగునాట హాట్‌టాపిక్‌గా ఉంది.