రవితేజతో కలిసి వెంకటేష్ ?

రవితేజతో కలిసి వెంకటేష్ ?

 

సీనియర్ హీరో వెంకటేష్ కు మల్టీస్టారర్ సినిమాలు బాగా కలిసొస్తున్నాయి.  మహేష్ బాబుతో కలిసి చేసిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేసిన 'ఎఫ్ 2' సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో అలంటి సినిమాపై వెంకీ ఆసక్తి చూపుతున్నారు.  తాజాగా దర్శకుడు వీరు పోట్ల వెంకీ కోసం ఒక మల్టీస్టారర్ కథను రెడీ చేశారట.  అందులో వెంకీతో కలిసి రవితేజ నటిస్తాడని తెలుస్తోంది.  ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాపై త్వరలోనే ఒక క్లారిటీ రానుంది.  ఇకపోతే వెంకటేష్ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ' అనే సినిమా చేస్తున్నాడు.