వెంకీ, చైతూల సినిమా ఎప్పుడంటే !

వెంకీ, చైతూల సినిమా ఎప్పుడంటే !

యువ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నాగ చైతన్యతో కలిసి ఒక సినిమాను చేయాల్సి ఉంది.  ఈపాటికే ఈ సినిమా మొదలవాసి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడింది.  తాజా సమాచారం మేరకు నవంబర్ 2వ వారం నుండి ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. 

ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేయనున్నాడు.  సురేష్ బాబు, కోన వెంకట్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతన్య లవర్ బాయ్ పాత్రలో కనిపించనుండగా వెంకీ అతనికి మామ పాత్రలో నటించనున్నాడు.  ఈ సినిమాకు 'వెంకీ మామ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.  ఈ చిత్రంలో వెంకీకి జోడీగా హుమా ఖురేషి నటించనుండగా చైతూ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది.