డుకాటి షోరూమ్ ప్రారంభోత్సవంలో వెంకీ, చైతన్య !

డుకాటి షోరూమ్ ప్రారంభోత్సవంలో వెంకీ, చైతన్య !

లగ్జరీ మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ డుకాటి ఇండియా భారతదేశంలో 9వ షోరూమ్‌ను ఏప్రిల్‌ 26న హైదరాబాద్‌, బంజారా హిల్స్‌ రోడ్‌ నెం. 12లో నూతనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి విక్టరీ వెంకటేష్‌, యువసామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. విక్టరీ వెంకటేష్‌ రిబ్బన్‌ కట్‌ చేసి విలాసవంతమైన డుకాటి ఇండియా షోరూమ్‌ను ప్రారంభించి.. జ్యోతి ప్రజ్వలన చేయగా, యువసామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య నాలుగు నూతన స్క్రాంబ్లర్‌ మోడల్స్‌ను  ఆవిష్కరించారు.