వెంకీమామలో అదే కీలకం

వెంకీమామలో అదే కీలకం

వెంకిమామ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతున్నది.  లాంగ్ షెడ్యూల్ ను అక్కడ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.  వెంకటేష్, నాగచైతన్య ఇతర తారాగణం పాల్గొనే సీన్స్ ను అక్కడ షూట్ చేస్తున్నారు.  ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో సాగే సినిమా కావడంతో ఈ షెడ్యూల్ కీలకంగా మారింది.  మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.  జై లవకుశ తరువాత బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.  

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది.  జూన్ 13 తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తరువాత హైదరాబాద్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది.  వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి... సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నది యూనిట్.  వెంకటేష్ కు జోడిగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా, నాగచైతన్యకు జోడిగా రాశి ఖన్నా నటిస్తుండటం విశేషం.