కామెడీనే నమ్ముకుంటున్న సీనియర్ హీరో

కామెడీనే నమ్ముకుంటున్న సీనియర్ హీరో

వెంకటేష్ సీరియస్ గా చేసిన సినిమాలకంటే ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమాలే భారీ విజయాలు సాధించాయి.  దానికి ఓ ఉదాహరణ ఎఫ్ 2.  ఎఫ్ 2 భారీ విజయం వెనుక వెంకటేష్ చేసిన కామెడీనే కారణం అయింది.  ఒక్క ఎఫ్ 2 మాత్రమే కాదు.  గతంలో చాలా సినిమాలు అలా హిట్ అయ్యినవే.  ప్రస్తుతం వెంకటేష్... మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకిమామ చేస్తున్నారు.  ఇదికూడా కామెడీ ఎంటర్టైనర్ గా వస్తోంది.  

ఈ సినిమా తరువాత నక్కిన త్రినాధరావుతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా కూడా ఎంటర్టైనర్ గా వస్తోందట.  ఇప్పటికే స్క్రిప్ట్ ను లాక్ చేశారు.  గతంలో త్రినాధరావు సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ సినిమాలు చేశారు.  అదే తరహాలో వెంకటేష్ సినిమాను కూడా కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దబోతున్నారు.  సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.