వెంకిమామలో వెంకటేష్ ఎలా కనిపిస్తాడంటే..!!

వెంకిమామలో వెంకటేష్ ఎలా కనిపిస్తాడంటే..!!

వెంకటేష్ ఎఫ్ 2 తరువాత నాగ చైతన్యతో కలిసి వెంకిమామ సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నది.  ఎఫ్ 2 సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.  ఇది కూడా పూర్తిస్థాయిలో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.  

వెంకటేష్ పల్లెటూరి వ్యక్తిగా కనిపించబోతున్నాడట.  పల్లెటూరిలో వెంకీ చేసే హంగామా అంతాఇంతా కాదని తెలుస్తోంది.  ఎఫ్ 2 లో మాదిరిగానే ఈ సినిమాలో కూడా ఫుల్ కామెడీ పండించబోతున్నాడట వెంకటేష్. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.