ధోనీ రీఎంట్రీపై వెంకటేష్ ప్రసాద్‌ కీలక వ్యాఖ్యలు..!

ధోనీ రీఎంట్రీపై వెంకటేష్ ప్రసాద్‌ కీలక వ్యాఖ్యలు..!

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ రీ ఎంట్రీపై చర్చ జరుగుతూనే ఉంది.. తాజాగా, టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ వెంకటేష్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ధోనీ.. తిరిగి జట్టులో చోటు సంపాదించుకోవడం కష్టమేనన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ధోనీ భవితవ్యంపై స్పందిస్తూ.. దాదాపు ఏడాదిగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న ధోనీ.. తన రీ ఎంట్రీని మరింత సంక్లిష్టం చేసుకున్నాడని చెప్పుకొచ్చారు.. ధోనీ వయస్సు 40కి చేరువుతోంది.. ఈ సమయంలో రీ ఎంట్రీ అనేమాట అంత సులువైన విషయం మాత్రం కాదన్నారు. అయితే, ధోనీ రీ ఎంట్రీపై టీమిండియా మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకోవాలని.. టీం మేనే‌జ్‌మెంట్ ఓ వ్యూహంలో భాగంగా అతన్ని కోరుకుంటే తప్ప ఎంఎస్‌ ధోనీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు వెంకటేష్‌ ప్రసాద్. మరోవైపు, ఒకవేళ ధోనీ తిరిగి జట్టులో ఆడితే మాత్రం.. అతడి బ్యాటింగ్ స్థానాన్ని మార్చాలని సూచించారు. ధోనీని ఫినిషర్‌గా కాకుండా బ్యాట్స్‌మెన్‌గా ఆడించాలన్న ఆయన.. నాకే అవకాశం ఉంటే.. నేను అతని బ్యాటింగ్ స్థానాన్ని మూడు లేదా నాలుగుకి మారుస్తానని.. లేదా 10 ఓవర్లు మాత్రమే మిగిలి ఉంటేనే ధోనీని ఫినిషర్‌గా పంపుతానని వ్యాఖ్యానించారు. ఏదేమైనా ధోనీ రీఎంట్రీపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.. ఏమైనా మిస్టర్ కూల్ ఆ మ్యాచ్‌ ఫినిష్ చేస్తే.. ఆ కిక్కే వేరుంటుందిగా...