మహేష్ లాంచ్.. వెంకటేష్ వాయిస్..!!

మహేష్ లాంచ్.. వెంకటేష్ వాయిస్..!!

దిల్ రాజు నిర్మాణంలో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా రూపొందుతున్న సినిమా శ్రీనివాస కళ్యాణం.  వివాహం అంటే ఏంటి.. దాని గొప్పదనం ఏంటి అనే విషయాలను అందరికి అర్ధమయ్యే విధంగా ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారట.  వేగేశ్న సతీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్, రాశిఖన్నాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.  

ఇదిలా ఉంటె, ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు లాంచ్ చేయడం ఒకెత్తయితే.. శ్రీనివాస కళ్యాణం ఓపెనింగ్ సీన్స్ కు వెంకటేష్ వాయిస్ ఓవర్ చెప్పడం మరొక ఎత్తు.  మహేష్, వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు మహేష్ బాబు 25 వ సినిమాను, వెంకటేష్ .. వరుణ్ తేజ్ ఎఫ్ 2 ఎఫ్ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో వస్తున్నవే.  ఈ చనువుతోనే  ఈ ఇద్దరు స్టార్స్ ను శ్రీనివాస కళ్యాణం ప్రచారం కోసం ఇలా వినియోగించుకున్నారు దిల్ రాజు.