వెంకీ కథ కొత్తగా ఉందే

వెంకీ కథ కొత్తగా ఉందే

విక్టరీ వెంకటేష్ వరుసగా కొత్త సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే.  అందులో తరుణ్ భాస్కర్ చిత్రం కూడా ఉంది.  ఈ చిత్ర కథ చాలా కొత్తగా ఉంటుందట.  సినీ వర్గాల సమాచారం మేరకు ఈ స్టోరీ ఒక స్పోర్ట్స్ డ్రామా అని, హార్స్ రేసింగ్ నేపథ్యంలో సాగేదని తెలుస్తోంది.  వెంకీ గతంలో బాక్సింగ్ నేపథ్యంలో 'గురు' అనే సినిమా చేసినా ఇలాంటి పూర్తి వైవిధ్యభరిత చిత్రం చేయడం ఇదే మొదటిసారి.  ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.  ప్రసుతం ఈ సీనియర్ హీరో నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ' అనే సినిమా చేస్తున్నారు.