రంగస్థలంపై వెంకటేష్ అమేజింగ్ వర్డ్స్

రంగస్థలంపై వెంకటేష్ అమేజింగ్ వర్డ్స్
రామ్ చరణ్, సుకుమార్ కలయికలో వచ్చిన అద్భుత దృశ్య కావ్యం రంగస్థలం. గత వారమే విడుదలైన ఈ సినిమా అశేష ప్రేక్షాదరణతో సినీ ప్రముఖులను సైతం కవ్విస్తోంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన వెంకటేష్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. వెంకటేష్ మాట్లాడుతూ ఇప్పుడే రంగస్థలం సినిమా చూశా. చిట్టి బాబు పాత్రలో రామ్ చరణ్ అద్భుతమైన నటనతో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయాడు. సినిమాలోని ప్రతి పాత్రను ఎంతో ఖచ్చితత్వంలో మలిచిన సుకుమార్ గారికి హాట్స్ ఆఫ్. చిత్రబృందానికి మరియు మైత్రి మూవీ మేకర్స్ కు నా అభినందనలు అంటూ తెలిపారు. రంగస్థలం సినిమా విడుదలైన మూడు రోజులలోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బాహుబలి తరువాత ఈ రేర్ ఫీట్ ను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అటు ఓవర్సీస్ లో కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ ను రాబడుతూ నాన్ బాహుబలి ఫీట్ ను క్రియేట్ చేసే దిశగా పయనిస్తోంది. ఇక వెంకటేష్ విషయానికొస్తే త్వరలోనే తేజ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ ను చేయనున్నాడు. https://twitter.com/MythriOfficial/status/981169962201960448