సెన్సార్ పూర్తి చేసుకున్న 'వెంకీమామ'

సెన్సార్ పూర్తి చేసుకున్న 'వెంకీమామ'

రియల్ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయినటువంటి విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య.. వెండితెరపై మామా అల్లుళ్లుగా కనిపించబోతున్నారు.. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘వెంకీమామ’.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీలో రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్.. మరోవైపు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'వెంకీమామ' సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ అందుకున్నాడు.