వెంకీ మామ గ్లింప్జ్ : మామా అల్లుళ్ల రచ్చ మొదలు

వెంకీ మామ గ్లింప్జ్ : మామా అల్లుళ్ల రచ్చ మొదలు


హీరో వెంకటేష్ ఆయన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యలు కలసి మామా అల్లుళ్ళుగా నటిస్తున్న సినిమా వెంకీ మామ. జై లవకుశ ఫేమ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా పాయల్ రాజ్ పుత్,  నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటించనున్నారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రంలో వెంకీ రైస్ మిల్ ఓనర్ గా, చైతు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ వచ్చేసింది వెంకీ మామ ఫస్ట్ లుక్ గ్లింప్జ్. ఇందులో వెంకీ, చైతూల బంధాన్ని ఎలివేట్ చేయ‌డానికి ప్రాధాన్యత ఇచ్చారు. ‘జై జ‌వాన్ – జై కిసాన్‌’ అనే స్లోగ‌న్ తో ఈ సినిమాలో వెంకీ రైతుగా, చై – సైనికుడిగా క‌నిపించ‌బోతున్నార‌న్న విషయాన్ని చెప్పేశారు. గోదావ‌రిలో ఈత నేర్పా.. బ‌రిలో ఆట నేర్పా.. ఇప్పుడు జాత‌ర‌లో వేట నేరిస్తా.. – అంటూ ఫైట్ చేస్తున్న వెంకటేష్ మాత్రమె ఈ గ్లింప్జ్ లో డైలాగులు చెప్పగా చైతూకి ఏమీ డైలాగులు ఇవ్వలేదు. వెండి తెర‌పై ఈ మామా అల్లుళ్లిద్దరూ ఇంకెంత రచ్చ  చేస్తారో చూడాలి.