వెంకిమామ బ్యాక్ డ్రాప్ ఇదే..!!

వెంకిమామ బ్యాక్ డ్రాప్ ఇదే..!!

వెంకటేష్ ఎఫ్2 విజయం తరువాత ఇప్పుడు మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకిమామ చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 22 నుంచి మొదలుకాబోతున్నది.  సర్దార్ గబ్బర్ సింగ్, జైలవకుశ దర్శకుడు బాబీ ఈ సినిమాకు దర్శకుడు.  సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా  కోనసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట.  

అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  రకుల్ ప్రీత్ హీరోయిన్.  గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్ కు రిలీజ్ చేయాలన్నది యూనిట్ ప్లాన్.