వెంకీ.. చైతూ అభిమానులకు గుడ్ న్యూస్ 

వెంకీ.. చైతూ అభిమానులకు గుడ్ న్యూస్ 

వెంకటేష్ నాగచైతన్య హీరోలుగా చేస్తున్న వెంకిమామ సినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గా ఫిక్స్ చేశారు.  ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ఎప్పుడో స్పష్టంగా తెలియలేదు. జనవరిలో రిలీజ్ చేయాలని మొదట అనుకున్నారు.  కానీ, జనవరి నుంచి క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 న చేయబోతున్నారని తరువాత టాక్ వచ్చింది.  కానీ, ఆ తరువాత ఈ సినిమాను డిసెంబర్ 13 వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.  

వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా చేస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లు.  బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.  సురేష్  ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.