కలర్‌ఫుల్‌గా శుభాకాంక్షలు చెప్పిన 'వెంకి మామ'

కలర్‌ఫుల్‌గా శుభాకాంక్షలు చెప్పిన 'వెంకి మామ'

రియల్ లైఫ్‌లోనే కాదు.. తొలిసారి రీల్ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా కనిపించబోతున్నారు హీరోలు విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య.. వీరిద్దరి కాంబోలే తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’... అయితే, వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.. మామా అల్లుళ్లుగా కలర్‌ఫుల్‌గా మెరిసిపోతున్నారు. వెంకటేష్, నాగచైతన్య కలిసి ఉన్న పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా.. ఈ పోస్టర్‌లో వెంకీ, చైతు లుక్ అదిరిపోయింది. ఇద్దరూ పంచెకట్టులో ఇరగదీశారు. ఇక, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు.