వెంకీ మామ అల్లరి మొదలైంది !

వెంకీ మామ అల్లరి మొదలైంది !

 

వెంకటేష్, నాగ చైతన్యల మల్టీస్టారర్ 'వెంకీ మామ' షూటింగ్ మొదలైంది.  ఈరోజు నుండి గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తున్నారు.  ఇందులో వెంకీతో పాటు నాగ చైతన్య కూడా పాల్గొంటున్నాడు.  వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు.  సురేష్ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  ఇందులో వెంకీకి జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగ చైతన్య సరసన రాశీఖన్నా మెరవనుంది.