దేశ సరిహద్దుల్లో చైతు సినిమా

దేశ సరిహద్దుల్లో చైతు సినిమా

నాగచైతన్య, విక్టరీ వెంకటేష్ హీరోలుగా చేస్తున్న మల్టీస్టారర్ మూవీ వెంకిమామ.  ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ గోదావరి జిల్లాలో ముగిసింది.  వెంకటేష్ పల్లెటూరి వ్యక్తిగా కనిపిస్తుంటే... నాగచైతన్య సైనికుడిగా కనిపిస్తున్నారు.  కాగా, సెకండ్ షెడ్యూల్ లో దేశ సరిహద్దుల్లో ఉన్న మంచుకొండల్లో ప్లాన్ చేశారు.  ప్రస్తుతం దర్శకుడు బాబీ అక్కడి లొకేషన్లను సెర్చ్ చేస్తున్నాడట.  

దేశ సరిహద్దుల్లో సైనికులతో కలిసి చేసే పోరాటాలు హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది.  ఒక సాంగ్ ను కూడా అక్కడే షూట్ చేస్తారట.  అయితే, సరిహద్దుల్లో నాగచైతన్య ఒక్కరే షూటింగ్ లో పాల్గొంటాడా లేదంటే వెంకటేష్ కూడా ఉంటాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.  బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నాలు హీరోయిన్లు.  దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.