మామతో చైతన్య సినిమా మొదలు !

మామతో చైతన్య సినిమా మొదలు !

నాగ చైతన్య, వెంకటేష్ కలిసి 'వెంకీ మామ' అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సంగతి  తెలిసిందే. చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన ఇన్నాళ్లు పట్టాలెక్కలేకపోయిన ఈ సినిమా ఎట్టకేలకు మొదలుకానుంది.  ఫిబ్రవరి 21 నుండి మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు యూనిట్. 

ఈ చిత్రంలో వెంకీకి జోడీగా శ్రియ శరన్ నటిస్తుండగా చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ మెరవనుంది.  ఈ చిత్రాన్ని 'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేమ్ బాబీ డైరెక్ట్ చేయనున్నాడు.  గతంలో 'ప్రేమమ సినిమాలో కాసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకీ, చైతూలు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో కలిసి నటిస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.