వెంకిమామ ట్రైలర్ టాక్ : లవ్ కామెడీ ఎమోషనల్ జర్నీ 

వెంకిమామ ట్రైలర్ టాక్ : లవ్ కామెడీ ఎమోషనల్ జర్నీ 

వెంకటేష్.. నాగ చైతన్య హీరోలుగా చేస్తున్న సినిమా వెంకిమామ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  రియల్ లైఫ్ లో మామ అల్లుళ్లయినా వెంకటేష్, నాగ చైతన్యలు ఇప్పుడు రీల్ లైఫ్ లో కూడా కలిసి నటిస్తున్నారు.  ఒక పల్లెటూరిలో ఉండే వెంకటేష్.. నాగ చైతన్యను పెంచి పెద్ద చేస్తాడు.  నాగ చైతన్య కోసమే తన జీవితం అనుకుంటాడు.  అయితే, కొంతమంది కుట్రల వలన వెంకటేష్ నుంచి నుంచి నాగ చైతన్య విడిపోయి ఆర్మీలో జాయిన్ అవుతాడు.  ఆ తరువాత ఏం జరిగింది అన్నది సినిమా.. ట్రైలర్ లో మామ అల్లుళ్ళ మధ్య లవ్, కామెడీ, ఎమోషన్ అన్నింటిని ట్రైలర్ లో చూపించారు. ఈ సినిమా డిసెంబర్ 13 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.