వెంకిమామ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ ?

వెంకిమామ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ ?

ఎఫ్ 2 తరువాత వెంకటేష్ చేస్తున్న సినిమా వెంకి మామ.  నాగచైతన్య తో కలిసి నటిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ చేశారు.  ప్రస్తుతం కాశ్మీర్ లో లాంగ్ షెడ్యూల్ జరుగుతున్నది.  బోర్డర్ కు పల్లెటూరికి ఉన్న సంబంధం ఏంటి అన్నది సినిమాలో చూపించబోతున్నారు.  ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  

సెప్టెంబర్ 13 వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని చేయబోతున్నారని వార్తలు అందుతున్నాయి.  అయితే, ఆ డేట్ ఎందుకు ఫస్ట్ చేశారనే విషయం తెలియదు. ఇది కేవలం పుకార్లేనా లేదంటే నిజంగానే ఆ డేట్ కు సినిమా రిలీజ్ అవుతుందా అన్నది తెలియాలి.  ఎన్టీఆర్ తో జై లవకుశ తరువాత దర్శకుడు బాబీ చేస్తున్న సినిమా ఇదే.  ఇందులో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా చేస్తున్నారు.