వెంకిమామ లాంచ్ ఎప్పుడంటే..!!

వెంకిమామ లాంచ్ ఎప్పుడంటే..!!

విక్టరీ వెంకటేష్ ఎఫ్ 2 సినిమా తరువాత ఫుల్ జోష్ లో ఉన్నాడు.  ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు రాబడుతున్నది.  ఇప్పటి వరకు రూ.72 కోట్ల రూపాయలకు పైగా షేర్ ను వసూలు చేసి రూ.80 కోట్ల రూపాయల దిశగా పరుగులు తీస్తోంది.  ఈ సినిమా తరువాత వెంకటేష్ తన మేనల్లుడు నాగచైతన్యతో వెంకిమామ సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు.  ఈ సినిమా పూజా కార్యక్రమాలలో ఇటీవలే లాంచ్ అయ్యింది.  ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.  

ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని యూనిట్ తెలిపింది.  రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.  సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన బాబీ ఈ సినిమాకు దర్శకుడు.  పీపుల్స్ మీడియా, సురేష్ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.  వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది యూనిట్.  మరి ఈ సినిమా కూడా ఎఫ్ 2 లాగా హిట్ అవుతుందా చూద్దాం.