నా పేరు పరిమళ అంటున్న వెన్నెల కిశోర్

నా పేరు పరిమళ అంటున్న వెన్నెల కిశోర్

 

నితిన్ హీరోగా 'భీష్మ' అనే సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ కూడా నటిస్తున్నాడు.  ఇందులో ఆయన పాత్ర పేరు పరిమళ.  గతంలో కూడా ఇలాంటి వెరైటీ పేర్లు కలిగిన పాత్రల్లో నటించిన వెన్నెల కిశోర్ ఈసారి కూడా మంచి హాస్యాన్ని పండించడానికి రెడీ అయ్యారు.  పేరుకు తగ్గట్టే ఆయన పాత్రలో కూడా బోలెడంత ఫన్, హ్యుమర్ ఉంటాయని తెలుస్తోంది.  వెంకీ కుడుములు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది.