చలం 'మైదానం' నవల ఆధారంగా సినిమా

చలం 'మైదానం' నవల ఆధారంగా సినిమా

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వరుసగామీడియం బడ్జెట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు , టాక్ షోలను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరుసగా వెబ్ సిరీస్ లను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో  ప్రముఖ రచయిత చలం రచించిన మైదానం అనే నవల ఆధారంగా సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాను దర్శకుడు  వేణు ఉడుగుల నిర్మిస్తున్నారు. రచయిత చలం 1927లో రాసిన ఈ నవలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. మైదానం అనే టైటిల్ తోనే సినిమాను కూడా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు కవి సిద్దార్థ్ దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న మైదానం త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇక వేణు ఉడుగుల  ప్రస్తుతం రానా హీరోగా విరాటపర్వం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక వేణు ఉడుగుల చలం రాసిన మైదానంపై ఆసక్తితో ఈ సినిమాను నిర్మిస్తున్నాడట. మీడియం బడ్జెట్ లో కొత్త వారితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే పూర్తివివరాలను తెలుపనున్నారు.