ఒమర్.. మెహబూబాల మధ్య బీజేపీ వివాదం..!

ఒమర్.. మెహబూబాల మధ్య బీజేపీ వివాదం..!

ఆర్టికల్ 370రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు జమ్మూ కాశ్మీర్లోని వివిధ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  జమ్మూ కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో వీరిని నిర్బంధించారు.  కాశ్మీర్లోని హరి నివాస్ లో ఒమర్, మోహబూబాలను ఉంచారు.  కింది ఫ్లోర్ లో ఒమర్ ఉంటె, పై ఫ్లోర్ లో మెహబూబాను ఉంచారు.  అయితే, ఈ ఇద్దరి మధ్య సడెన్ గా వివాదం చోటు చేసుకుంది.  

బీజేపీని జమ్మూ కాశ్మీర్లోకి తీసుకొచ్చింది నువ్వంటే నువ్వని వాదనకు దిగారు.. 2015, 2018 లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఒమర్ విమర్శించారు.  ఈ విమర్శలను మెహబూబా తిప్పి కొట్టింది.  వాజ్ పాయి హయాంలో ఫరూక్ అబ్దుల్లా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, ఆ సమయంలో మీరు (ఒమర్ అబ్దుల్లా) విదేశాంగ సహాయమంత్రిగా పనిచేశారని మెహబూబా వాదించింది.  ఇద్దరి మధ్య వాదనలు తీవ్రస్థాయికి చేరడంతో.. ఒమర్ అబ్దుల్లాను అక్కడి నుంచి అటవీశాఖ అధీనంలో ఉన్న గెస్ట్ హౌస్ కు తరలించింది.