ఓటు హక్కు వినియోగించుకున్న అద్వాణీ

ఓటు హక్కు వినియోగించుకున్న అద్వాణీ

మూడోదశ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేత ఎల్‌.కే. అద్వాణీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని షాపూర్ హిందీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన ఓటు వేశారు. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే గుజరాత్‌లో ఓటు వేశారు. మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్ధులు షీలా దీక్షిత్, అజయ్ మాకేన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.