ధనుష్ సినిమాలో ఆ రోల్ లేదు...

ధనుష్ సినిమాలో ఆ రోల్ లేదు...

వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అసురన్.  ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.  ధనుష్ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.  ధనుష్ తో పాటు ఇందులో మరో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారని వార్తలు వచ్చాయి.  

ఈ వార్తలపై దర్శకుడు వెట్రిమారన్ స్పందించాడు.  అసురన్ లో విజయ్ సేతుపతి చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, విజయ్ సేతుపతిని సంప్రదించలేదని అన్నారు.  ధనుష్ తో వెట్రిమారన్ కు ఇది నాలుగో సినిమా.  గతంలో మారి, వడ చెన్నై, మారి 2 సినిమాలు చేశారు.  ఈ సినిమా తరువాత ధనుష్ దర్శకుడు దురై సెంథిల్ కుమార్ తో సినిమా చేస్తారు.  ఇందులో కూడా ధనుష్ డ్యూయెల్ రోల్ చేస్తుండటం విశేషం.