వీహెచ్‌తో వార్‌: నగేష్‌పై వేటు

వీహెచ్‌తో వార్‌: నగేష్‌పై వేటు

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్‌ ముదిరాజ్‌ను కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌  చేశారు. క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ కోదండ రెడ్డి అధ్యక్షతన ఇవాళ గాంధీ భవన్‌లో జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. 11వ తేదీన ఇందిరా పార్కు వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి మాజీ ఎంపీ వి.హనుమంతరావు, నగేష్ ముదిరాజ్‌ మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన అంశాలను క్రమశిక్షణ కమిటీ చర్చించింది.  క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరైన నగేష్ ముదిరాజ్.. ఘటన పూర్వాపరాలపై వివరణ ఇచ్చారు. వీహెచ్‌ కూడా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. పార్టీ నాయకుల నుంచి కూడా సమాచారాన్ని సేకరించిన కమిటీ.. అన్ని అంశాలనూ లోతుగా పరిశీలించి నగేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీనియర్‌ నాయకులు, పార్టీలో అనేక పదవులు నిర్వహించిన వీహెచ్‌పైన భౌతిక దాడికి దిగడాన్ని క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది.