వీహెచ్‌ రాజీనామా

వీహెచ్‌ రాజీనామా

ఏఐసీసీ కార్యదర్శి పదవికి వి.హనుమంతరావు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీకి పంపించినట్టు చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ కొనసాగకపోతే తానూ తన పదవిలో కొనసాగబోనని లేఖలో స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవిలో రాహుల్‌ ఉంటేనే కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉంటుందన్నారు. రాహులే బాధ్యతల నుంచి తప్పుకుంటే ఇక కార్యకర్తల సంగతి ఏంటని వీహెచ్‌ ప్రశ్నించారు. ఇక.. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్టులకు పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.