దక్షిణ బెంగాల్ లో 700 రామ నవమి ర్యాలీలు జరపనున్న వీహెచ్ పీ

దక్షిణ బెంగాల్ లో 700 రామ నవమి ర్యాలీలు జరపనున్న వీహెచ్ పీ

ఏప్రిల్ 14న జరిగే శ్రీరామనవమిని పశ్చిమ బెంగాల్ లో ఘనంగా నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషద్ సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 700 శోభాయాత్రలు నిర్వహించనున్నట్టు వీహెచ్ పీ వర్గాలు చెబుతున్నాయి. 'గత ఏడాది పండుగలు చాలా భారీ ఎత్తున నిర్వహించాం. ఈ ఏడాది అంతకు మించి జరుపుతామని' వీహెచ్ పి బెంగాల్ శాఖ ప్రతినిధి తెలిపారు.

గత ఏడాది శ్రీరామనవమి వేడుకల్లో సుమారు 40 లక్షల మంది పాల్గొన్నారని ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరగనుందని చెప్పారు. ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్ లో 1.5-2 లక్షల మందితో పండుగ చేస్తామని అన్నారు. 

గత సెప్టెంబర్ లో పోలీసు కాల్పుల్లో ఇద్దరు మాజీ విద్యార్థులు మరణించడంతో ఇస్లాంపూర్ లోని ద దరివిట్ హైస్కూల్ ఉద్రిక్తతలతో అట్టుడికింది. ఇద్దరు ఉపాధ్యాయుల నియామకానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. వారిలో ఒకరు. విద్యార్థుల్లోని ఒక వర్గం, దరివిట్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు సాహిత్యం, సైన్స్ లకు టీచర్లు కావాలని పోలీసులతో ఘర్షణ పడ్డారు. 

ఇస్లాంపూర్ రాయిగంజ్ లోక్ సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ బీజేపీ బలమైన శక్తిగా ఉంది. ఏప్రిల్ 14న రాయిగంజ్ లో ఎన్నికలు జరగనున్నాయి. అంతకు 4 రోజుల ముందు శ్రీరామనవమి వేడుకలు నిర్వహించడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.