కోర్టుకి చేరిన నేవీ చీఫ్ గా వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ నియామకం

కోర్టుకి చేరిన నేవీ చీఫ్ గా వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ నియామకం

తనను పరిశీలనలోకి తీసుకోకుండా వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ ను కొత్త నేవీ చీఫ్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ వైస్ అడ్మిరల్ బిమల్ వర్మ కోర్టుకెళ్లారు. సాయుధ బలగాల ట్రిబ్యునల్ లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తాను వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ కంటే సీనియర్ అయినప్పటికీ తనను పక్కనపెట్టి ఆయనను నేవీ చీఫ్ గా నియమించడాన్ని సవాల్ చేశారు. మార్చి 23న వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ ని నావికాదళ అధిపతిగా నియమించనున్నట్టు ప్రకటించారు. రక్షణ మంత్రిత్వశాఖ ఈ మేరకు సమాచారం ఇచ్చింది.

మే చివరన రిటైర్ కానున్న అడ్మిరల్ సునీల్ లాంబా స్థానంలో వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ బాధ్యతలు చేపడతారు. ఈ నియామకానికి సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా మెరిట్ ఆధారంగా పరిశీలించిన తర్వాత వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ ను ఎంపిక చేసినట్టు అధికారిక వర్గాలు చెప్పాయి. అండమాన్ నికోబార్ కమాండ్ బాధ్యతల్లో ఉన్న కమాండర్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిమల్ వర్మ ఈ అత్యున్నత పదవికి ప్రధాన పోటీదారుల్లో ఒకరు. ఆయన సింగ్ కంటే సీనియర్.