'మహర్షి'పై ఉపరాష్ట్రపతి ప్రశంసలు !

'మహర్షి'పై ఉపరాష్ట్రపతి ప్రశంసలు !

మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం మంచి వసూళ్లతో నడుస్తోంది.  ప్రేక్షకులతో పాటు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు చాలామంది సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.  వ్యవసాయ ప్రాధాన్యతను నేటి తరానికి తెలియజెప్పడానికి చేసిన ప్రయత్నం బాగుందని మెచ్చుకున్నారు.  తాజాగా బీజేపీ సీనియర్ నేత, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం సినిమాను వీక్షించి ప్రశంసలు గుప్పించారు. 

ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన 'కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ‘మహర్షి’ చిత్రాన్ని చూడడం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం.  ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా.  గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం ‘మహర్షి’.  సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు శ్రీ మహేష్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు శ్రీ వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను' అన్నారు.