రూపాయకే అంత్యక్రియలు, స్పందించిన ఉపరాష్ట్రపతి

రూపాయకే అంత్యక్రియలు, స్పందించిన ఉపరాష్ట్రపతి

పేద, మధ్య తరగతి ప్రజలకు భారం కలగకుండా కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్‌ రవీందర్‌సింగ్‌.. రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు నిధులు కేటాయించడంతోపాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా ఉంటామని ప్రకటించారు. ‘అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్‌’ పథకం వివరాలను తెలుసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. కులమతాలు, పేద ధనిక బేధభావం లేకుండా అంతిమసంస్కారాల కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించిన కరీంనగర్ కార్పొరేషన్‌, మేయర్‌ రవీందర్‌సింగ్‌కు అభినందనలు తెలిపారు. అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్‌ ద్వారా ప్రశంసించారు. ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని  పురపాలకశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ తెలిపారు.