నేడు, రేపు హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన

నేడు, రేపు హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన

గురువారం, శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. వెంకయ్య నాయుడు గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి జుబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి చేరుకుంటారు. శుక్రవారం ఉదయం 10.15 గంటలకు జుబ్లీహిల్స్ నుంచి దోమలగూడలోని ఏవీ కాలేజీకి వెళ్తారు. జుబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు, నాగార్జున సర్కిల్, తాజ్ కృష్ణ, కేసీపీ జంక్షన్, అంబేద్కర్ విగ్రహం, సాధురాం లేన్ మీదుగా ఏవీ కాలేజీకి చేరుకుంటారు. అనంతరం 12 గంటల సమయంలో తిరిగి జుబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.