ఆకలి, అవినీతి లేని సమాజం కావాలి..

ఆకలి, అవినీతి లేని సమాజం కావాలి..

ఆకలి, అవినీతి లేని సమాజం నిర్మాణం కావాలని ఆకాంక్షించారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు... ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. అనంతరం మాట్లాడుతూ... యధ్భావం తద్భవతి... దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. వర్షాలు బాగా కురవాలి... ప్రకృతి వైప రీత్యాలు లేకుండా ఉండాలని దేవుడిని ప్రార్థించాన్న ఆయన.. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రముఖులు తిరుమలకు దర్శనానికి రావాలని.. తద్వారా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. నేను రాజకీయాల్లో లేను... భవిష్యత్తులోనూ ఇక ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చిన వెంకయ్య.. అసమానతలు. .ఘర్షణలు లేని సమాజం కావాలని కోరుకుంటున్నానన్నారు. దేశానికి సేవ చేసుకునే శక్తిని నాకు ఇవ్వమని శ్రీవారి సన్నిధిలో మూడు రోజులు ఉంటానని.. దైవ దర్శనం, సాహిత్యం, సత్సంగంతో ఆ శక్తి వస్తుందని విశ్వసిస్తున్నట్టు వెల్లడించారు. తిరుమలలో తాను అన్నదానం కార్యక్రమం, నాద నీరాజనం కార్యక్రమాల్లో పాల్గొంటానని.. భక్తి, ముక్తితోనే శక్తి వస్తుందన్నారు వెంకయ్యనాయుడు.