విక్టరీ హీరో సినీ ప్రస్థానానికి 34 ఏళ్ళు ..

విక్టరీ హీరో సినీ ప్రస్థానానికి 34 ఏళ్ళు ..

టాలీవుడ్ స్టార్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు విక్టరీ వెంకటేష్ . వెంకటేష్ నటనలో ఎక్కువ శాతం కామెడీ, సెంటిమెంట్ ఉంటుంది. సెంటిమెంట్ చిత్రాలతో ఆయన ఎక్కువ మంది మహిళా అభిమానులకు సంపాదించారు. వెంకీ నటించిన చిత్రాలు కుటుంబసమేతంగా చూడదగినవి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. వెంకటేష్..తను ఎవరితోనూ పోటీ పడరు..తనకు తానే పోటీ అన్నట్లు వ్యవహరిస్తారు. అలాగే ఇన్నేళ్ల సినీ జీవితంలో విక్టరీ వెంకటేష్ ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఎందరో హీరోలు ఇండస్ట్రీలోకి వస్తుంటారు పోతుంటారు. కానీ విక్టరీ వెంకటేష్ ఇప్పటికి హీరోగానే కొనసాగుతున్నారంటే ప్రేక్షకులు ఆయనను ఎంతగా ఆదరిస్తున్నారో అర్ధమవుతుంది. సహజమైన నటనతో తెలుగువారి మనసులను గెలుస్తూ వస్తున్నారు వెంకటేష్. అయితే 1986 ఆగష్టు 14న వెంకీ హీరోగా ఫస్ట్ మూవీ కలియుగ పాండవులు విడుదల అయింది.నేటికీ ఈ సినిమా విడుదలై 34 ఏళ్ళు  ఇప్పటికే అదే ఎనర్జీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు వెంకటేష్ . ఇటీవలే వెంకీమామ సినిమా విజయంతో మంచి జోష్ మీదున్న వెంకీ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ అసురన్ రీమేక్ తెలుగు నారప్పలో నటిస్తున్నారు.