వైరల్ అవుతున్న వెంకటేష్ పెళ్లి ఫోటో...

వైరల్ అవుతున్న వెంకటేష్ పెళ్లి ఫోటో...

విక్టరీ వెంకటేష్ గురించి తెలియని వారు ఉండరు. అయితే ఆయన కుటుంబం గురించి మాత్రం పెద్దగా బయట ఎవరికి తెలియదు. ఎందుకంటే వారు ఎప్పుడు కెమెరా ముందుకు రాలేదు. ఆయన భార్య నీరజతో పెళ్లి జరిగినప్పటి నుండి ఇంతవరకు ఆవిడని బయటికి తీసుకురాలేదు. ఎప్పుడో ఒక్కసారి కుటుంబ వేడుకల్లో మాత్రమే కనిపిస్తుంటారు నీరజ దగ్గుబాటి. ఆయన పిల్లలు కూడా బయట ఎక్కువగా కనిపించరు. అయితే ఈ మధ్య నిశ్చితార్ధం కు సంబంధించిన ఓ స్పెషల్ ఫోటోను అక్కినేని వారి కోడలు సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే సమంత పోస్ట్ చేసిన ఫొటోలో నాగ చైతన్య, సమంత తో పాటుగా ఎప్పుడు బయటి కనిపించని విక్టరీ వెంకటేష్ కుమారుడు అర్జున్ కూడా ఉన్నాడు. ఇక ఆ విధంగానే వెంకటేష్ పెళ్లి ఫోటో కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం వారిద్దరి పెళ్లి ఫోటోను చూసుకుని నెటిజన్లు అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఎఫ్ 2, వెంకీమామ లాంటి సినిమాలతో విజయాలు అందుకున్న వెంకటేష్. ప్రస్తుతం నారప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడ్డింది.