‘నార‌ప్ప’ నెక్స్ట్ మూవీ ఏంటి ?

‘నార‌ప్ప’ నెక్స్ట్ మూవీ ఏంటి ?

టాలీవుడ్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌స్తుతం ‘నార‌ప్ప’ సినిమా చేస్తోన్న విష‌యం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఓ వర్గం ఆడియన్స్ లలో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా తరువాత యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో ఒక సినిమా ఉంటుందని గత ఏడాది నుంచి అనేక రకాల కథనాలు వస్తున్నాయి. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ అనే మూవీ చేసిన త‌రుణ్ భాస్క‌ర్ వెంక‌టేష్ తో సినిమా చేయాల‌ని భావించాడు. ‘హార్స్ రైడింగ్’ కథతో ఓ సినిమా చేయాలని భావించిన.. సడ‌న్ గా క‌రోనా వైర‌స్ లాక్ డౌన్ తో ప‌రిస్థితులు మారిపోయాయి.

అయితే, వెంకీతో ఇప్పుడు కొత్త క‌థ‌తో సినిమా చేసేందుకు త‌రుణ్ భాస్క‌ర్ ఆస‌క్తి చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ హీరోకు ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ క‌థ వినిపించాడ‌ని… త్వ‌ర‌లో పూర్తి క‌థ సిద్ధ‌మ‌వుతుంద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు అనిల్ రావిపూడితో క‌లిసి వెంకీ ‘ఎఫ్3’ చిత్రాన్ని చేయాల్సి ఉంది. వెంకీ వీరిద్దరి దర్శకుల కంటే ముందు త్రివిక్రమ్ తో చేయాల్సింది, కానీ త్రివిక్రమ్ నెక్స్ట్ ఎన్టీఆర్ తో వర్క్ చేస్తుండడంతో ఈ సినిమాలను ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. మ‌రి నార‌ప్ప షూటింగ్ ను పూర్తి చేసిన త‌ర్వాత వెంక‌టేశ్ ఏ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్తాడో చూడాలి.