విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల 'ఎఫ్ 2' ప్రారంభం..

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల 'ఎఫ్ 2' ప్రారంభం..

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎఫ్ 2' సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ముహూర్తపు షాట్ కార్యక్రమం వేడుకలా జరిగింది. దేవుడి పటాలపై తొలి షాట్‌ను చిత్ర యూనిట్ షూట్ చేశారు. అల్లు అరవింద్ క్లాప్ కొట్టడంతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మెహ్రీన్ ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది.