హృదయ విదారక దృశ్యం: లాక్ డౌన్ లో ఆహరం దొరక్క కుక్క కళేబరాన్ని... 

హృదయ విదారక దృశ్యం: లాక్ డౌన్ లో ఆహరం దొరక్క కుక్క కళేబరాన్ని... 

ఆకలి మనిషిని ఎలాంటి పనులైనా చేయిస్తుంది.  చావడానికైనా, చంపడానికైనా ఆకలే కారణం.  కొంతంది ఆకలికి తట్టుకోలేదు ఏది దొరికితే దానిని తినేస్తుంటారు.  లాక్ డౌన్ కారణంగా బీహార్ లో కొంతమంది పిల్లలు కప్పలు తిన్న సంగతి తెలిసిందే.  ఇక ఇదిలా ఉంటె రాజస్థాన్ లో మరో దారుణం చోటు చేసుకుంది.  రాజస్థాన్ లోని జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్లే రహదారిలో ఓ వ్యక్తి రోడ్డుపై పడిఉన్న కుక్క కళేబరాన్ని తింటూ కనిపించాడు.  

గత కొన్ని రోజులుగా ఆకలితో ఉన్నానని, ఎలాంటి ఆహరం దొరక్కపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆకలికి తట్టుకోలేక కుక్క కళేబరాన్ని తినాల్సిన పరిస్థితి వచ్చినట్టు సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు.   ఆ హృదయవిదారక దృశ్యం ప్రతి ఒక్కరిని కలిచివేసింది.  అయితే, హైవే రోడ్డు, నిత్యం వాహనాలు పరుగులు తీస్తున్న ఎవరూ కూడా అతనికి ఆహారం అందించలేదు.  అయితే, ఓ వ్యక్తి ఆగి ఆహరం, తాగేందుకు నీళ్లు అందించి ఆ దృశ్యాలను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు సదరు వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్ లో చేర్చినట్టు సమాచారం.  ఇలాంటి సంఘటనలు లాక్ డౌన్ కాలంలో అనేకం జరుగుతున్నాయి. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నా ఇంకా ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.