పవన్‌-రానా మూవీ: త్రివిక్రమ్ కు వీడియోతో స్వాగతం

పవన్‌-రానా మూవీ: త్రివిక్రమ్ కు వీడియోతో స్వాగతం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాతో కలిసి మలయాళ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, చిత్ర బృందం శుక్రవారం ఓ వీడియోను పంచుకుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. ఇందులో కథానాయికలుగా సాయి పల్లవి, ఐశ్వర్యరాజేశ్‌లు ఎంపికైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా నిన్న ‘వకీల్‌సాబ్’ టీజర్‌ పవన్ అభిమానులను అలరించగా, తాజాగా పవన్‌ తర్వాతి సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ తో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.