విద్యాబాలన్ క్రేజ్ అలాంటిది

విద్యాబాలన్ క్రేజ్ అలాంటిది

బాలీవుడ్ క‌థానాయిక‌, డ‌ర్టీపిక్చ‌ర్ ఫేం విద్యాబాల‌న్ టాలీవుడ్‌లో ప్ర‌వేశిస్తోంది అన‌గానే ఒక‌టే క్యూరియాసిటీ. బాల‌న్ రెండు ద‌శాబ్ధాల కెరీర్‌లో నేరుగా ఓ తెలుగు సినిమాలో న‌టించ‌క‌పోయినా ఒక తెలుగ‌మ్మాయి పాత్ర‌లో న‌టించి అద‌ర‌గొట్టేసింది. విజ‌య‌ల‌క్ష్మి అలియాస్ సిల్క్‌స్మిత‌గా గొప్ప‌గా అభిన‌యించి ఆక‌ట్టుకుంది. ఆ సినిమాలో బాల‌న్ కైపెక్కించే ఎక్స్‌ప్రెష‌న్స్ హిందీ జ‌నాల‌కే కాదు, తెలుగు యువ‌త గుండెల్ని ట‌చ్ చేశాయి. ప్ర‌స్తుతం తెలుగులో బాల‌య్య టైటిల్ పాత్ర‌ధారిగా, అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న‌ ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

ఇప్ప‌టికే ఎన్టీఆర్ యూనిట్‌తో బాల‌న్ క‌లిసి ప‌ని చేస్తున్నారు. ఈ బ‌యోపిక్‌లో తార‌క‌రాముని స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్ న‌టిస్తున్నారు. ఆన్ లొకేష‌న్ బాల‌య్య లేకుండానే షూటింగ్ సాగుతోందిట‌. ఇక‌పోతే ఈ సినిమాకోసం విద్యా పూర్తిగా స్లిమ్మ‌య్యార‌ని తెలుస్తోంది. విద్యాబాల‌న్ క్రేజు గురించి ప్ర‌స్థావిస్తే.. ఈ భామ‌కు మాస్‌లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఏకంగా 12 బ్రాండ్ల‌లో న‌టిస్తోంది. కేవ‌లం 10నెల‌ల్లో 9 బ్రాండ్ల‌కు సంత‌కం చేసి రికార్డ్ సృష్టించింద‌ని బాలీవుడ్ మీడియా చెబుతోంది.