ఎన్టీఆర్ గురించి విద్యాబాలన్ ఏం చెప్పిందో తెలుసా..?

ఎన్టీఆర్ గురించి విద్యాబాలన్ ఏం చెప్పిందో తెలుసా..?

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా జనవరి 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాకు ఇప్పటికే హైప్ వచ్చింది.  సినిమాలోని పాటలు ఆకట్టుకున్నాయి.  భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా బసవతారకం పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండబోతున్నది.  బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషించారు.  బసవతారకం ఎలా ఉండేదో..ఎన్టీఆర్ తో, పిల్లలతో ఎలా మెలిగేదో అచ్చంగా అలాగే చూపించారట.  ఈ సినిమా గురించి విద్యాబాలన్ కొన్ని విషయాలను పంచుకుంది.  ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  

తనకు 9 సంవత్సరాల వయసు ఉండగా హైదరాబాద్ వచ్చిందట.  అప్పట్లో ఎన్టీఆర్ గురించి చాలా విన్నానని చెప్పింది.  బాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశం వచ్చి.. అక్కడ సినిమాలు చేస్తున్న సమయంలో టాలీవుడ్ నుంచి అనేక ఆఫర్లు వచ్చాయి.  కథలు నచ్చకపోవడంతో రిజక్ట్ చేసినట్టు చెప్పింది.  ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఆఫర్ వచ్చాక.. కథ విన్నాక తప్పకుండా చేయాలని అనిపించి సినిమా చేసినట్టు విద్యాబాలన్ పేర్కొంది.  దర్శకుడు క్రిష్ చాలా చక్కగా చిత్రీకరించినట్టు విద్యాబాలన్ పేర్కొంది.