సన్నగా ఉండటమే సరిపోదంటోన్న రకుల్! లావు తప్పేం కాదంటోన్న విద్యా!

సన్నగా ఉండటమే సరిపోదంటోన్న రకుల్! లావు తప్పేం కాదంటోన్న విద్యా!

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్, విద్యా బాలన్ తమ సందేశాల్ని అభిమానులతో పంచుకున్నారు. స్లిమ్ అండ్ సెక్సీగా ఉండే రకుల్, లావుగా, లవ్లీగా ఉండే విద్యా ఇద్దరూ 'మనకు మనమే ముఖ్యం' అన్నారు! 

రకుల్ ప్రీత్ ఓ చెట్టుపైకి ఎక్కి ఫోటో తీయించుకుని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పక్కన కొంచెం పెద్ద మ్యాటర్ నే షేర్ చేసింది. అయితే, ఆమె వరల్డ్ హెల్త్ డే మెసేజ్ సారాంశం ఏంటంటే... ఆరోగ్యం బయట నుంచీ, లోపల నుంచీ కూడా ప్రధానమే. అయితే, మన అంతర్గత ఆరోగ్యం ఇంకా ఎక్కువ ముఖ్యం. జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయటం, సన్నగా కనిపించటం మాత్రమే సరిపోదు. లోపలి నుంచీ మనం ఆనందంగా ఉండాలి. చిన్న పిల్లల మాదిరిగా లోలోన కేరింతలు కొట్టటం మానకూడదు అంటోంది రకుల్ ప్రీత్!

విద్యా బాలన్ కూడా వరల్డ్ హెల్త్ డే పోస్ట్ లో ఇన్నర్ వరల్డ్ గురించే మాట్లాడింది. మరోసారి అధిక బరువు ప్రస్తావన చేసిన ఆమె ''మీ ఆరోగ్యంలో బరువు ఒక అంశం అయితే ఫర్వాలేదు. కానీ, అదే మీ గుర్తింపు కాకూడదు'' అంటూ ఫ్యాన్స్ కి హితబోధ చేసింది. అధిక బరువు ఉన్న వాళ్లు కృంగిపోవాల్సిన పని లేదన్నట్టుగా విద్యా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ కొనసాగింది. 
ఎంతో మందిని ప్రభావితం చేసే సినీ తారలు ఇలాంటి మంచి మాటలు చెప్పటం... నిజంగా హర్షణీయమే!