చంద్రబాబును కలిసిన భారత క్రికెటర్‌

చంద్రబాబును కలిసిన భారత క్రికెటర్‌

టీమిండియా ఆటగాడు, తెలుగు తేజం హనుమ విహారి.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిశాడు. ఈనెల 19న వరంగల్‌లో వివాహం చేసుకోనున్న విహారి.. 20న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశాడు. ఈ నేపథ్యంలో చంద్రబాబును స్వయంగా కలిసి ఆహ్వానించాడు విహారి. అమరావతిలో చంద్రబాబునాయుడుని కలిసి విహారి ఆహ్వాన పత్రికను అందజేశాడు. గత అక్టోబర్‌లో వరంగల్‌కు చెంది ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రీతిరాజ్‌తో విహారికి నిశ్చితార్థమైంది.