గుండెపోటా? కుట్ర కోణమా?: విజయసాయిరెడ్డి

గుండెపోటా? కుట్ర కోణమా?: విజయసాయిరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానాలున్నాయని వైసీపీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని ఉదయం తమకు సమాచారం అందిందని.. కానీ పరిసరాలు చూస్తే అనుమానాస్పద మృతిగా తెలుస్తోందని అన్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపించాలని వైఎస్‌ కుటుంబసభ్యులు కోరుతున్నారని చెప్పారు.  పోస్ట్‌మార్టం నివేదికలో వాస్తవాలు బయటికొస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.